: వాహనదారులకు కొత్త కష్టాలు... జరిమానా కట్టకుంటే ఇక అరెస్టే!


నిబంధనలను ఉల్లంఘించి వాహనాలు నడుపుతూ, నిఘా కెమెరాల కళ్లకు చిక్కి, చలానాలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న వాహనదారులకు కొత్త కష్టాలు వచ్చి పడనున్నాయి. చిన్నపాటి నిర్లక్ష్యాలకు పెను మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి రానుంది. కనీసం మూడు పెండింగ్ చలానాలు ఉన్న వారిపై ఛార్జిషీటును దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇవి కూడా చెల్లించకుంటే, వారిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరచనున్నారు. ఈ తరహా కేసులు వేలకొద్దీ వుండటంతో, ప్రత్యేకంగా 17 కోర్టులు ఏర్పాటయ్యాయి. వీటిల్లో కేవలం ట్రాఫిక్ కేసులను మాత్రమే విచారిస్తారు. కాగా, హైదరాబాదు పరిధిలో 45 లక్షల వాహనాలు తిరుగుతుంటాయి. రోజూ సగటున 7 వేలకు పైగా కేసులు నమోదవుతుంటాయి. ట్రాఫిక్ ఉల్లంఘనల కింద రెండు లక్షల వాహనాలకు దాదాపు 10 లక్షల చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ క్లియర్ చేసేందుకు నిర్ణయించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News