: తెలంగాణలో హెల్మెట్ తప్పని సరి చేస్తాం: రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి
ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి చేయాలని భావిస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో రహదారి భద్రత మండలితో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు సుప్రీంకోర్టు రాష్ట్రాల నుంచి నివేదిక కోరిందని అన్నారు. గతేడాది సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో 6 నుంచి 7 వేల మంది మరణించారని గణాంకాలు చెబుతున్నాయని చెప్పారు. బైక్ ప్రమాద మృతులే అధిక సంఖ్యలో ఉండడంతో, రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్ తప్పనిసరి చేస్తామని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్యాబ్ లలో నేరాలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.