: స్త్రీ, పురుష వివాహాలు దైవనిర్ణయం... మరి ఇవేమి వివాహాలు?: బాబీ జిందాల్ విమర్శలు


అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి బాబీ జిందాల్ విమర్శల స్థాయిని పెంచారు. ఒబామా 'కేర్'ను తీవ్రంగా వ్యతిరేకించే జిందాల్, స్వలింగ సంపర్కుల వివాహాలపై తాజాగా అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అసహనం వ్యక్తం చేశారు. ఆడా, మగ వివాహాలు దైవనిర్ణయాలని పేర్కొన్న ఆయన, స్వలింగ సంపర్క వివాహాలు అనైతికమని అన్నారు. విలువలకు కట్టుబడి ఉండాలనుకునే వారికి సుప్రీంకోర్టు తీర్పు శరాఘాతం లాంటిదని ఆయన పేర్కొన్నారు. దైవ నిర్ణయానికి వ్యతిరేకంగా స్వలింగ వివాహాలను ప్రొత్సహించడం తప్పని ఆయన పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కానీ, రాష్ట్రాల ఆమోదం కానీ లేకుండా ఇంత కీలక నిర్ణయం ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. సుప్రీంకోర్టు వ్యవస్థ పూర్తిగా అదుపు తప్పిందని, జ్యుడీషియరీ సభ్యులు తమ సొంత అభిప్రాయాలను ప్రజల మీద రుద్దుతున్నారని ఆయన విమర్శించారు.

  • Loading...

More Telugu News