: అమీర్ పేటలో 80 లక్షలకు కుచ్చుటోపీ పెట్టిన సాఫ్ట్ వేర్ సంస్థ


హైదరాబాదులో భారీ మోసం వెలుగు చూసింది. అమీర్ పేటలోని ఓ సాఫ్ట్ వేర్ సంస్థ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కో నిరుద్యోగి నుంచి 40 వేల రూపాయలు వసూలు చేసిన ఎంఎన్ఎస్ సాఫ్ట్ వేర్ సంస్థ నెలలు గడుస్తున్నా ఎలాంటి ఉద్యోగావకాశం చూపించకపోవడంతో, నిరుద్యోగులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి ఈ సంస్థ సుమారు 80 లక్షల రూపాయలు వసూలు చేసినట్టు తేలింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News