: హైదరాబాదుపై మాట్లాడే నైతిక హక్కు తెలంగాణ ప్రజలకే ఉంది: కడియం


హైదరాబాదు విషయంలో ఏపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తప్పుబట్టారు. హైదరాబాద్ తెలంగాణ ప్రజల ఆస్తి అని, హైదరాబాదుపై మాట్లాడే నైతిక హక్కు తెలంగాణ ప్రజలకే ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆంధ్రా నేతలకు ఎలాంటి హక్కులేదని అన్నారు. ఆంధ్రా నేతలు సెక్షన్-8 గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మాట్లాడాలని హితవు పలికారు. చంద్రబాబు వ్యవహారంపై దృష్టి మరల్చేందుకే ఏపీ నేతలు డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్న ఏపీ నేతలు వారి వద్ద ఉన్న ఆధారాలు ఎందుకు బయటపెట్టడం లేదని కడియం ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News