: వసుంధరా రాజేకు అపాయింట్ మెంట్ నిరాకరించిన ప్రధాని!


రాజస్థాన్ సీఎం వసుంధరా రాజేకు నిరాశ ఎదురైంది. నీతీ అయోగ్ సదస్సు కోసం ఢిల్లీ వచ్చిన ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ నిరాకరించినట్టు తెలిసింది. దీంతో, ఆమె మోదీని కలవకుండానే ఢిల్లీ వీడారు. ఐపీఎల్ మాజీ చీఫ్ లలిత్ మోదీ వ్యవహారంలో వసుంధర పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. మిత్రుడైనందునే అతడికి సహాయపడేందుకు వసుంధర తాపత్రయపడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. అంతేగాకుండా, ఆమె సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో, బీజేపీ అధినాయకత్వం ఆమెపై వచ్చిన ఆరోపణలు పట్టించుకోకుండా, నీతీ అయోగ్ కు రావాలంటూ కబురు పంపింది. కానీ, ఢిల్లీ వచ్చిన ఆమెకు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ నిరాకరించడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. అటు, బీజేపీ చీఫ్ అమిత్ షాతోనూ ఆమె భేటీ కాలేదని తెలిసింది.

  • Loading...

More Telugu News