: తెలంగాణ అంటే 'ప్రత్యేక రాజ్యం' అన్న భావనలో ఉన్నారు: మంత్రి గంటా


రాష్ట్ర విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అనుసరించడం లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం అంటే ప్రత్యేక రాజ్యం అన్న భావనలో ఆ నేతలున్నారని టీఆర్ఎస్ పై పరోక్ష విమర్శ చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఏపీకి పదో షెడ్యూల్ లో అన్యాయం జరుగుతోందని 23 సార్లు గవర్నర్ దృష్టికి తెచ్చానని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో పరీక్షలు నిర్వహించిన యూనివర్శిటీలు ఏపీ విద్యార్థుల ఫలితాలు నిలిపివేయడం దారుణమని అన్నారు. అందుకే 'హైదరాబాదును యూటీ' చేయాలన్న డిమాండ్ వస్తోందని మంత్రి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News