: ఏపీ విద్యుత్ ఉద్యోగులను ఉన్నపళంగా తొలగించడం అన్యాయం: చంద్రబాబు


పద్నాలుగు వందల మంది ఏపీ విద్యుత్ ఉద్యోగులను స్థానికత పేరుతో తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఉద్యోగులను తెలంగాణ సర్కారు ఉన్నపళంగా తొలగించడం అన్యాయమన్నారు. గవర్నర్, కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఉద్యోగులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని చెప్పారు. విజయవాడలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్ర విభజన తరువాత తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడాలని కోరుకున్నానని, కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రతిదానికీ గిల్లికజ్జాలు పెట్టుకుంటోందని అన్నారు. సమస్యల పరిష్కారానికి అస్సలు సహకరించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఏడాది పాలన ముగిసినందునే సెక్షన్ 8పై ఇప్పుడు మాట్లాడుతున్నామన్న బాబు, ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం గవర్నర్ కే పూర్తి అధికారాలు ఉంటాయని స్పష్టం చేశారు. అసలు ఏపీ మంత్రులు, అధికారులపై తెలంగాణ ప్రభుత్వ పెత్తనమేంటి? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News