: కడపలో భారీగా ఎర్రచందనం స్వాధీనం... ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్ల కార్యకలాపాలు శృతి మించాయి. తాజాగా జిల్లాలోని ఓబుళవారి పల్లెలో ఆరుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్టు కడప ఎస్పీ నవీన్ గులాటీ తెలిపారు. వారి నుంచి రూ.6 కోట్ల విలువైన 3 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. పట్టుబడిన వారిలో వెంకట్రావు అనే బడా స్మగ్లర్ కూడా ఉన్నాడని తెలిసింది. ఈ నెలలోనే కడప జిల్లాలో పలువురు తమిళనాడు స్మగ్లర్లను, కూలీలను పోలీసులు అరెస్టు చేశారు.