: సామాన్య కార్యకర్తగా నారా లోకేశ్...బెజవాడ సమావేశంలో కార్యకర్తల మధ్య ఆసీనులైన వైనం!


సాదాసీదా డ్రెస్సు, మెడలో పార్టీ ఐడీ కార్డు, చేతిలో పెన్నూ, పేపరు... వేదిక నుంచి కాస్త దూరంగా ఆరో వరుసలో కూర్చున్న ఓ వ్యక్తి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చెబుతున్న విషయాలను ఆసక్తిగా వింటూనే, అవసరమనుకున్న వాటిని నోట్ చేసుకుంటున్నారు. తొలుత అంతగా పట్టించుకోని వార్తా చానెళ్లన్నీ కాసేపటి తర్వాత ఆ వ్యక్తినే ఫోకస్ చేస్తూ లైవ్ ప్రసారాలు కొనసాగించాయి. ఆయన ఎవరో కాదు, పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్. మొన్నటి పార్టీ మహానాడులో వేదికపై హల్ చల్ చేసిన నారా లోకేశ్, కొద్దిసేపటి క్రితం విజయవాడలోని శేషసాయి కళ్యాణమండపంలో ప్రారంభమైన పార్టీ సమావేశంలో పార్టీ కార్యకర్తల మధ్యే కూర్చున్నారు. అంతేకాక పార్టీ అభివృద్ధి కోసం, కార్యకర్తల సంక్షేమం కోసం అధినేత చంద్రబాబు చెబుతున్న విషయాలను ఆయన ఆసక్తిగా వింటూనే, వాటిని తన వెంట తెచ్చుకున్న పేపర్ పై నోట్ చేసుకున్నారు.

  • Loading...

More Telugu News