: విజయవాడలో దారుణం... యాసిడ్ దాడిలో మహిళ మృతి
నవ్యాంధ్ర రాజకీయ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విజయవాడలో నానాటికీ నేరాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపడుతున్నా, నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. నిన్న రాత్రి స్నేహితుడి బైక్ పై వెళుతున్న ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడికి దిగారు. నగరంలోని గూడవల్లి సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మహిళను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా, ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ మహిళ చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి తల్లి వద్ద ఫిర్యాదు తీసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.