: రాజ్ నాథ్ నోట 'ప్రత్యామ్నాయం' మాట!


ఢిల్లీ పర్యటనలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నిన్న తీవ్ర విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ వెళుతున్న నరసింహన్ కు నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పెద్ద షాకే ఇచ్చారట. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులను సకాలంలో చక్కదిద్దని పక్షంలో తాము ‘ప్రత్యామ్నాయ’ ఏర్పాట్లు చేసుకోక తప్పదని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారట. దీంతో కాస్త షాక్ కు గురైన నరసింహన్ వెనువెంటనే వివరణ ఇచ్చుకునేందుకు యత్నించారని సమాచారం. ఈ క్రమంలోనే ఆయన హోం శాఖ కార్యదర్శి గోయల్ తో పాటు సంయుక్త కార్యదర్శి అలోక్ కుమార్ లతో దఫదఫాలుగా చర్చలు కొనసాగించారని వినికిడి. తొలుత గోయల్, అలోక్ కుమార్ లతో భేటీ అయిన నరసింహన్, ఆ తర్వాత వారితో కలిసి రాజ్ నాథ్ కేబిన్ కు వెళ్లారు. కొద్దిసేపు నలుగురు చర్చల్లో మునిగిన తర్వాత గోయల్, అలోక్ కుమార్ లు బయటకెళ్లగా, రాజ్ నాథ్ తో నరసింహన్ ఏకాంత చర్చలు జరిపారు. ఈ సందర్భంగానే రాజ్ నాథ్ ‘ప్రత్యామ్నాయ’ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో షాక్ కు గురైన నరసింహన్, రాజ్ నాథ్ వద్ద సెలవు తీసుకుని నేరుగా మళ్లీ గోయల్ వద్దకు వెళ్లారు. మరికాసేపటికే మళ్లీ రాజ్ నాథ్ కేబిన్ తలుపు తట్టారు. రాజ్ నాథ్ ఘాటు వ్యాఖ్యలతోనే నరసింహన్ మీడియాపై చిందులు తొక్కారన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News