: ఢిల్లీ బయలుదేరిన కేటీఆర్...కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్న టీఎస్ మంత్రి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కొద్దిసేపటి క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన నేడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ కానున్నారు. నిన్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే కేటీఆర్ ఢిల్లీ పయనమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఓటుకు నోటు వ్యవహారం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించే దిశగా గవర్నర్ రంగంలోకి దిగనున్న నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళుతుండటంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికర చర్చకు తెర లేచింది.