: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీవర్షాలు... చిక్కుకుపోయిన తెలుగువారు


ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీవర్షాలు కురుస్తున్నాయి. అక్కడి నదులు పొంగిపొర్లుతున్నాయి. దాంతో, బద్రీనాథ్ యాత్రకు వెళ్లిన దాదాపు 150 మంది తెలుగువారు అక్కడ చిక్కుకుపోయారు. వంద మీటర్ల మేర రోడ్డు తెగిపోవడంతో నాలుగు రోజులుగా వారు ఓ సత్రంలోనే గడుపుతున్నారు. ఒక పూటే భోజనం చేస్తూ ఆపన్న హస్తం అందించేవారి కోసం చూస్తున్నారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. తెలుగు యాత్రికుల్లో అత్యధికులు అనంతపురం జిల్లాకు చెందినవారని సమాచారం. ఇక, కర్ణాటకకు చెందిన వారు కూడా బద్రీనాథ్ యాత్ర సందర్భంగా చిక్కుకుపోయారు.

  • Loading...

More Telugu News