: కుర్దు జాతీయులపై విరుచుకుపడిన ఐఎస్ఐఎస్


ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మిలిటెంట్లు మరోసారి పంజా విసిరారు. సిరియాలోని కొబాని పట్టణం, దాని సమీప గ్రామం బ్రాఖ్ బూటాన్ పై దాడికి దిగిన ఐఎస్ ముష్కరులు విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో పాటు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. కుర్దు జాతీయులను లక్ష్యంగా చేసుకున్న ఐఎస్ కిరాతకులు స్వైర విహారం చేశారు. దాడి అనంతర దృశ్యాలు భీతిగొలిపేలా ఉన్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం సిరియా విభాగం పేర్కొంది. శవాలు ఇళ్లలోనూ, వీధుల్లోనూ విసిరేసినట్టుగా పడి ఉన్నాయని వివరించింది. ఈ దాడిలో కనీసం 145 మంది మరణించినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News