: రేవంత్ ఇచ్చిన ఆ 50 లక్షలు ఎక్కడివో గుర్తించారు
ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఏసీబీ మరో ముందడుగు వేసింది. ఈ కేసులో కీలకమైన ఏఎఫ్ఎస్ఎల్ నివేదికను అందుకున్న ఏసీబీ అధికారులు...ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కిచ్చిన 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో గుర్తించారు. అమీర్ పేటలోని ఓ చిట్ ఫండ్ సంస్థ నుంచి ఆ 50 లక్షలు రూపాయలు తీసుకున్నట్టు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఆ డబ్బునే స్టీఫెన్ సన్ కిచ్చినట్టు భావిస్తున్నారు. ఆ డబ్బు స్టీఫెన్ సన్ కు ఇచ్చిన వెంటనే రేవంత్ ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.