: మరింత దిగువకు బంగారం, వెండి ధరలు
వరుసగా ఆరవరోజు బంగారం ధరలు పడిపోయాయి. ఈ రోజు మార్కెట్ లో రూ.70 తగ్గిన పసిడి ధర రెండు నెలల కనిష్ఠ స్థాయికి చేరింది. దాంతో 10 గ్రాముల ధర బులియన్ మార్కెట్ లో రూ.26,680కి చేరింది. అటు వెండి ధర కూడా రూ.360 తగ్గి కేజీ ధర రూ.36,190 పలుకుతోంది. బలహీనంగా ఉన్న ప్రపంచ మార్కెట్ల ప్రభావం, నగల వ్యాపారులు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేయకపోవడంతో వీటి ధరలు మరింత తగ్గాయని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.