: తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపుతున్న కేసీఆర్: కాంగ్రెస్
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఇంటికో ఉద్యోగం, పేదలకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తదితర వాగ్దానాలలో ఏ ఒక్కదాన్ని కూడా కేసీఆర్ అమలు చేయలేదని మండిపడ్డారు. కేసీఆర్ చెప్పే మాయమాటలను ఇకపై వినే ఓపిక తెలంగాణ ప్రజలకు లేదని చెప్పారు. ఈ రోజు ఏఐసీసీ కార్యదర్శి కుంతియాతో పాటు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అనే విషయం ప్రజలందరికీ తెలుసని... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతోందని అన్నారు.