: ఉపఖండంలో ఇంతే: ధోనీకి అఫ్రిది బాసట


బంగ్లాదేశ్ చేతిలో భారత్ ఓటమిపాలవడం పట్ల టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడాన్ని పాకిస్థాన్ స్టార్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు. ధోనీపై విమర్శలు రావడం తననెంతో బాధించిందని అన్నాడు. ఉపఖండం సరళి ఇలాగే ఉంటుందని, గెలిచినప్పుడు ఆకాశానికెత్తేస్తారని, ఒక్క సిరీస్ లో ఓటమిపాలైతే పాతాళానికి తొక్కేస్తారని వివరించాడు. "బంగ్లాదేశ్ టూర్ తర్వాత ధోనీపై విమర్శలు రావడం విచారకరం. ఉపఖండంలో ఇంతే. గెలిస్తే పొగుడుతారు, ఓడితే విమర్శిస్తారు. కొన్ని సమయాల్లో వాస్తవిక పరిస్థితికి దర్పణం పట్టనందుకు మీడియా కూడా బాధ్యత వహించాలి. ఓసారి ధోనీ రికార్డు చూడండి. భారత్ కు అద్భుతమైన సేవలందించాడు. అతని రికార్డే చెబుతుంది అతనెంత గొప్పవాడో!" అని వ్యాఖ్యానించాడు.

  • Loading...

More Telugu News