: 'ఎమర్జెన్సీ' నుంచి ప్రధాని మోదీ పాఠం నేర్చుకోవాలి: దిగ్విజయ్


ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు, తదనంతర పరిణామాలను ఓసారి పరిశీలించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సూచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. ప్రధాని హోదాలో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ ప్రకటించిన అనంతరం, 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైందని, అది ప్రతి ఒక్కరికీ గుణపాఠమని, ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎమర్జెన్సీ నుంచి పాఠం నేర్చుకోవాలని అన్నారు. "అప్పట్లో ఎమర్జెన్సీ ప్రకటించినందుకు ఇందిరా గాంధీ క్షమాపణ కూడా చెప్పారు. అయినా, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించారు. మోదీ సహా ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గ్రహించాలి. పార్టీ పరంగానూ ఆనాడు ఎంతో నష్టపోయాం. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేసేందుకు ఎవరూ ప్రయత్నించరాదు" అని పేర్కొన్నారు. జమ్మూలో మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవిధంగా తెలిపారు.

  • Loading...

More Telugu News