: వరల్డ్ కప్ వివాదాన్ని తిరగదోడిన ముస్తఫా కమల్
ఐసీసీ మాజీ అధ్యక్షుడు ముస్తఫా కమల్ వరల్డ్ కప్ వివాదాన్ని తిరగదోడారు. ఈ ఏడాది జరిగిన వన్డే ప్రపంచకప్ లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ వివాదాస్పదం కావడం తెలిసిందే. ఆ మ్యాచ్ లో కొన్ని అంపైరింగ్ నిర్ణయాలు భారత్ కు అనుకూలంగా వచ్చాయని ఆరోపించడం ద్వారా కమల్ అప్పట్లోనే పెద్ద దుమారం లేపారు. తాజాగా, ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ క్వార్టర్ ఫైనల్ సమరంలో భారత్ విజయం వెనుక ఎన్.శ్రీనివాసన్ ఉన్నారని ఆరోపించారు. మ్యాచ్ ఫలితాన్ని ఆయనే ప్రభావితం చేశారని మండిపడ్డారు. భారత్ లో క్రికెట్ వ్యవస్థను నడిపించే ఆయనే, మెల్ బోర్న్ మ్యాచ్ లోనూ చక్రం తిప్పారని వివరించారు. ఇక, బంగ్లాదేశ్ జట్టు తాజాగా భారత్ పై సిరీస్ నెగ్గడం పట్ల కమల్ హర్షం వ్యక్తం చేశారు.