: రైళ్లు రద్దయితే ఇక నుంచి ఎస్ఎమ్ఎస్ సందేశం
భారతీయ రైల్వే సంస్థ ప్రయాణికుల కోసం కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. టికెట్ రిజర్వేషన్ చేయించుకున్న వారి రైళ్లు రద్దయితే దానికి సంబంధించిన సమాచారం తక్షణమే వారి మొబైల్ ఫోన్లకు ఎస్ఎమ్ఎస్ (సంక్షిప్త సమాచారం) రూపంలో రానుంది. టికెట్ రిజర్వేషన్ చేయించుకున్న సమయంలో ప్రయాణికులు ఏ ఫోన్ నంబర్ ఇస్తే దానికే సందేశం వస్తుందని రైల్వే మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. సంబంధిత రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉన్న రైళ్ల సమాచారం, వేళలు, వాటి రద్దు సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందించే ఉద్దేశంతో పైలెట్ ప్రాజెక్టు కింద సౌకర్యాన్ని తీసుకువచ్చామన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థమే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, రైళ్లు రద్దయితే వెంటనే టికెట్లు రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.