: అత్యాచారాలు, హింస, లంచాలు, ఎన్ కౌంటర్లు, అరాచకాలు... ఇండియాలో ఇవేనంటూ అమెరికా నివేదిక!


ఇండియాలో భద్రతా దళాలు, పోలీసులు హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతూ, అరాచకాలు చేస్తున్నారని, దేశానికి ఇదే పెను సమస్యగా మారిందని అమెరికా ప్రభుత్వం ఒక నివేదిక వెలువరించింది. మానవ హక్కులను కాపాడడంలో సైన్యం, పోలీసు వ్యవస్థ విఫలమయ్యాయని పేర్కొంది. అత్యాచారాలు, లంచాలు తీసుకోవడం, ప్రజలను హింసించడం, ఎన్ కౌంటర్ లు, నేరాలపై సరైన సమయంలో స్పందించకపోవడం వంటి పలు ఆరోపణలు వారిపై ఉన్నాయని యూఎస్ స్టేట్ డిపార్టుమెంట్ వివరించింది. ఎంతో మంది మాయమవుతున్నారని, జైళ్లలో పరిస్థితి దారుణంగా ఉందని, అన్యాయంగా అరెస్టై నిర్బంధంలో ఉన్న వారి సంఖ్య పెరుగుతోందని, విచారణ నిమిత్తం దీర్ఘకాలం పాటు జైళ్లలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించింది. అత్యాచారాలు, గృహ హింస, వరకట్న హత్యలు, పరువు హత్యలు, లైంగిక వేధింపులు, మహిళల పట్ల అగౌరవం తదితరాలు ఇండియాలో తీవ్రమైన సాంఘిక సమస్యలని పేర్కొంది. యువతుల అక్రమ ట్రాఫికింగ్, చిన్నారులతో వెట్టిచాకిరి, యువతులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగడం దేశాన్ని వెనక్కు నెట్టేస్తున్నాయని అభిప్రాయపడింది. అయితే, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న ఇండియాలో గత సంవత్సరం పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని వెల్లడించింది.

  • Loading...

More Telugu News