: గంటా ఇంటిని ముట్టడించిన ఏఐఎస్ఎఫ్... విశాఖలో పలువురు విద్యార్థులు అరెస్ట్
ఏపీ వాణిజ్య రాజధానిగా రూపుదిద్దుకుంటున్న విశాఖపట్నంలో కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థల వసూళ్ల పర్వానికి కళ్లెం వేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెరేషన్ (ఏఐఎస్ఎఫ్) విద్యార్థులు ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటిని ముట్టడించారు. మంత్రి ఇంటి ముట్టడికి యత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నేేతలు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. అనంతరం పోలీసులు పెద్ద సంఖ్యలో విద్యార్థులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.