: చరిత్ర సృష్టించిన సత్నాం సింగ్... ఎన్ బీఏకు ఎంపికైన తొలి భారతీయుడు
భారతీయుల్లో ఎవరికీ దక్కని ఘనత అతనికి దక్కించి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ (ఎన్ బీఏ)కు ఎంపికైన తొలి భారతీయుడిగా సత్నాం సింగ్ చరిత్ర సృష్టించాడు. సత్నాం సింగ్ భమరాను 52వ ఆటగాడిగా ఎంపిక చేసుకున్నట్టు డల్లాస్ మెవ్రిక్స్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 19 సంవత్సరాల వయసున్న సత్నాం సింగ్ 7.2 అంగుళాల పొడగరి. ఇప్పటికే ఐఎంజీ అకాడమీ తరపున పలు బాస్కెట్ బాల్ పోటీలు ఆడాడు. సత్నాంకు ముందు ఏ భారతీయుడూ ఎన్ బీఏకు ఎంపిక కాలేదు. అయితే, కెనడాలో జన్మించిన భారత సంతతి యువకుడు సిమ్ భుల్లార్ గత సంవత్సరం ఎన్ బీఏకు ఆడాడు. కాగా, సత్నాం ఎంపిక పట్ల భారత బాస్కెట్ బాల్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు.