: పుట్టపర్తి విమానాశ్రయాన్ని కొనుగోలు చేయనున్న ఏపీ ప్రభుత్వం?


అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉన్న విమానాశ్రయాన్ని ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేయనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సత్యసాయి జీవించి ఉన్నప్పుడు దేశ, విదేశాలకు చెందిన ఎంతో మంది పుట్టపర్తికి వస్తుండేవారు. బాబా శివైక్యం చెందిన తర్వాత విమానాశ్రయానికి రద్దీ తగ్గింది. దీంతో, ఎయిర్ పోర్టు నిర్వహణ పుట్టపర్తి ట్రస్టుకు కష్టసాధ్యంగా మారింది. ఈ పరిస్థితుల్లో, ఏపీలో విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనుకుంటున్న ప్రభుత్వానికి ఈ ఎయిర్ పోర్టును అమ్మాలనే భావనలో ట్రస్టు ఉంది. పుట్టపర్తి విమానాశ్రయానికి ఇప్పటికే 450 ఎకరాల స్థలం ఉంది. దీని పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కలుపుకుంటే ఎయిర్ పోర్టును అద్భుతంగా అభివృద్ధి చేయవచ్చని అధికారులు సైతం భావిస్తున్నారు. రానున్న రోజుల్లో అనంతపురం జిల్లాకు వివిధ రకాలు పరిశ్రమలు వస్తున్నాయని... ఈ నేపథ్యంలో, పుట్టపర్తి విమానాశ్రయం కీలకంగా మారుతుందని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News