: ఇక నాన్ స్టాప్ ‘కిక్కు’...ఉదయం నుంచి తెల్లవారుజాము దాకా మద్యం విక్రయాలు!


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఇకపై మద్యం విక్రయాలు నాన్ స్టాప్ గా కొనసాగనున్నాయి. హైదరాబాదులో టూరిజం అభివృద్ధి, మరింత మంది విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ మేరకు నాన్ స్టాప్ ‘కిక్కు’ను అందించేందుకు తెలంగాణ సర్కారు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు త్వరలో ఖరారు కానున్న నూతన మద్యం పాలసీలో దీనిపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. తెలంగాణ అబ్కారీ శాఖ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... హైదరాబాదులోని బార్లు, స్టార్ హోటళ్లు, టూరిజం హోటళ్లలో ఉదయం 6 గంటల నుంచి తెల్లవారుజాము 3 గంటల దాకా మద్యం విక్రయాలను కొనసాగించనున్నారు. తొలుత 24 గంటల పాటు మద్యం విక్రయాలను కొనసాగించాలనుకున్నా, తెల్లవారుజాము 3 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా ఓ మూడు గంటల పాటు స్వల్ప విరామమివ్వాలని నిర్ణయించారట. అంతేకాక, ఏపీ సర్కారు తరహాలోనే షాపింగ్ మాల్స్ లోనూ మద్యం విక్రయాలకు శ్రీకారం చుట్టేందుకు సర్కారు సన్నాహాలు చేస్తోందట.

  • Loading...

More Telugu News