: 'హౌసింగ్ డాట్ కాం' సీఈఓ రాహుల్ యాదవ్ మరో రాజీనామా!


రియల్ ఎస్టేట్ రంగంలో సేవలందిస్తున్న హౌసింగ్ డాట్ కాం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ యాదవ్ మరోసారి వార్తల్లోకెక్కారు. వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ మరోసారి సంస్థను వీడి వెళ్లనున్నట్టు సమాచారం. అయితే, ఈసారి ఆయన రాజీనామాను బోర్డు డైరెక్టర్లు ఆమోదించి, రాహుల్ ను ఇంటికి పంపేస్తారని తెలుస్తోంది. కొంతకాలం క్రితం హౌసింగ్ డాట్ కాంకు రాహుల్ రాజీనామా చేయగా, బోర్డు బతిమిలాడి ఆయన తన నిర్ణయాన్ని మార్చుకునేలా చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సంస్థలోని తన వాటా ఈక్విటీలను ఉద్యోగులకు పంచి రాహుల్ ప్రపంచానికి పరిచయమయ్యాడు. తనలాగే అందరూ చెయ్యాలంటూ, వివిధ ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ, వివాదాస్పదుడయ్యాడు. కాగా, మరో రెండు వారాల్లో జరిగే బోర్డు డైరెక్టర్ల సమావేశంలో రాహుల్ రాజీనామాను ఆమోదించవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News