: జడ్జీలు లేకుండా కోర్టులు లేవు...స్టీఫెన్ ‘నాట్ బిఫోర్’ విచారణలో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు


ఓటుకు నోటు కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ దాఖలు చేసిన ‘నాట్ బిఫోర్’ వ్యాజ్యంపై హైకోర్టు నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులు లేకుంటే న్యాయస్థానాలు లేవని ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు జడ్జీ జస్టిస్ శివశంకరరావు వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో తన పేరును తొలగించాలంటూ కేసులో నాలుగో నిందితుడు జెరూసలెం మత్తయ్య దాఖలు చేసుకున్న క్వాష్ పిటీషన్ ను సవాల్ చేస్తూ స్టీఫెన్ సన్ కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై జరిగిన విచారణలో స్టీఫెన్ సన్ న్యాయవాది గండ్ర మోహన్ రావు, జస్టిస్ శివశంకరరావుల మధ్య వాడీవేడీ వాదనలు సాగాయి. ‘‘మత్తయ్య దాఖలు చేసుకున్న పిటీషన్ లో కోర్టు వ్యవహరించిన తీరుపై పత్రికల్లో పలు కథనాలు వస్తున్నాయి. ఈ వ్యాజ్యాన్ని మీరు వింటే న్యాయం జరగదు. మీరు విచారణ నుంచి తప్పుకోవాలి’’ అని స్టీఫెన్ న్యాయవాది గండ్ర మోహన్ రావు చేసిన వాదనపై న్యాయమూర్తి జస్టిస్ శివశంకరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘పత్రికా కథనాలు కోర్టులను ప్రభావితం చేయలేవు. అయినా జడ్జీలు లేకుంటే న్యాయస్థానాలు లేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి’’ అంటూ జస్టిస్ శివశంకరరావు ఒకింత అసహనం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News