: హిందూపురంలో బాలయ్య మూడో రోజు పర్యటన ప్రారంభం...పోలీస్ ష్టేషన్ కు బాలయ్య భూమిపూజ
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురంలో మూడో రోజు పర్యటనను కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. మూడు రోజుల క్రితం హిందూపురం వెళ్లిన బాలయ్య తొలిరోజు పట్టణంలో ప్రజా దర్బార్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా హిందూపురం రూరల్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన అక్కడ కూడా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. తాజాగా కొద్దిసేపటి క్రితం మూడో రోజు పర్యటనకు బయలుదేరిన బాలయ్య, పట్టణంలో కొత్తగా ఏర్పాటు కానున్న మూడో పట్టణ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు.