: టీ ఏసీబీపై ఎన్నికల కమిషన్ గుర్రు...కోరినా ఆధారాలు ఇవ్వలేదని కోర్టుకు ఫిర్యాదు!
ఓటుకు నోటు కేసులో కీలక సాక్ష్యాలుగా పరిగణిస్తున్న ఆడియో, వీడియో టేపుల విషయంలో తెలంగాణ ఏసీబీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారట. ఈ మేరకు సాక్షాత్తు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న ఏసీబీ కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వెలుగుచూసిన ఓటుకు నోటు కేసు వివరాలు, సాక్ష్యాలు తమకు అవసరమని తెలంగాణ ఏసీబీకి చెప్పామని ఎన్నికల సంఘం కోర్టుకు చెప్పింది. అయితే సదరు ఆధారాలను తమకిచ్చేందుకు తెలంగాణ ఏసీబీ అధికారులు ససేమిరా అన్నారని ఫిర్యాదు చేసింది. ఈ మేరకు నిన్న కోర్టులో ఎన్నికల సంఘం మెమో దాఖలు చేసింది. కేసులో కీలక సాక్ష్యాలుగా పరిగణిస్తున్న ఆడియో, వీడియో టేపులను తమకు ఇప్పించాలని సదరు పిటీషన్ లో ఎన్నికల సంఘం కోర్టును అభ్యర్థించింది.