: ధోనీకి గవాస్కర్ సూచన


బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నప్పుడు వారిలో ఆత్మవిశ్వాసం నింపాల్సిన బాధ్యత కెప్టెన్ దేనని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు. ప్రస్తుతం టీమిండియా వన్డే జట్టు కెప్టెన్ ధోనీ చేయాల్సింది కూడా అదేనని సూచించారు. బ్యాట్స్ మన్ కానివ్వండి, బౌలర్ కానివ్వండి జట్టులోని ప్రతి సభ్యుడు కెప్టెన్ తన పక్షాన ఉండాలని కోరుకుంటారని, ముఖ్యంగా పరుగులు అధికంగా ఇస్తున్న బౌలర్ కు కెప్టెన్ మద్దతు అవసరమని వివరించారు. బౌలర్ భుజంపై చేయివేసి 'నీ బౌలింగ్ పై నాకు నమ్మకం ఉంద'ని కెప్టెన్ చెబితే, అది తప్పక ప్రభావం చూపిస్తుందని సన్నీ అభిప్రాయపడ్డారు. కెప్టెనే కాకుండా సీనియర్ ఆటగాళ్లైనా ఆత్మవిశ్వాసం నింపవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News