: సోలార్ విమానానికి వాతావరణ ఇబ్బందులు!
ప్రపంచ పర్యటనకు బయల్దేరిన 'సోలార్స్ ఇంపల్స్-2'కు వాతావరణ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో జపాన్ లో నిలిచిన 'సోలార్ ఇంపల్స్-2' విమానం, ఆగస్టు 5 లోగా పసిఫిక్ మహాసముద్రం దాటకుంటే, ఏడాది పాటు జపాన్ లోనే నిలిచిపోవాల్సి ఉంటుందని పైలట్ బెర్ ట్రండ్ పికార్డ్ చెప్పారు. సోలార్ ఇంపల్స్ విమానం పది గంటలపాటు నిర్విరామంగా ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ, ఆ తరువాత ప్రయాణించడం కష్టమని ఆయన తెలిపారు. పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంలో మబ్బులు, ఇతర వాతావరణ మార్పులతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, వాటిని అధిగమించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 5 లోగా పసిఫిక్ మహాసముద్రం దాటాలని, లేని పక్షంలో ఏడాదిపాటు సోలార్ ఇంపల్స్ విమానం జపాన్ లోనే ఆగిపోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. కాగా, సోలార్ రవాణా విమానాలు ప్రవేశపెట్టేందుకు ఇంపల్స్ ప్రపంచయాత్ర దోహదపడుతుందని గతంలో శాస్త్రవేత్తలు పేర్కొన్న సంగతి తెలిసిందే.