: ఎమ్మెల్యే అనంత్ సింగ్ ను అరెస్ట్ చేయించింది నేనే!: లాలూ
జేడీయూ ఎమ్మెల్యే అనంత్ సింగ్ ను అరెస్ట్ చేయించింది తానేనని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. తన ఒత్తిడితోనే అనంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. "మీ చేతుల్లోని బిడ్డను ఎవరైనా ఎత్తుకుపోతే మీరేం చేస్తారు? ఒక జర్నలిస్టుపై దాడి చేస్తే మీరేం చేస్తారు? నేనూ అదే చేశా. అనంత్ లాంటి వ్యక్తులు సమాజంలో నెలకొన్న మత సామరస్యాన్ని దెబ్బతీస్తారు. చట్టం ముందు అందరూ సమానులే. అనంత్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన అనుచరులు కొనసాగిస్తున్న హింసాకాండను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఇలాంటి చర్యలను నేను సహించను" అని లాలూ అన్నారు. మరోవైపు, అనంత్ సింగ్ తో పాటు మరో పన్నెండు మందిని పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం జేడీయూ కార్యకర్తలు బంద్ కు పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమాలను చేపట్టడమే కాక, రైల్వే స్టేషన్ కు వెళ్లి నిప్పుపెట్టేందుకు యత్నించారు.