: ఆంధ్రజ్యోతిని నిషేధిస్తే స్పందించని వారు... టీన్యూస్ కు నోటీసులిస్తే గగ్గోలు పెడుతున్నారు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రజ్యోతి ఛానల్ పై నిషేధం ఉన్నా ఎన్నడూ మాట్లాడని వారు... టీన్యూస్ కి నోటీసులు ఇచ్చిన వెంటనే గగ్గోలు పెట్టడం ప్రారంభించారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నేత బస్వరాజు సారయ్యలు ఆరోపించారు. టీన్యూస్ కి నోటీసులిస్తే, రాజ్యాంగానికే విఘాతం కలిగిందనే విధంగా వీరు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మీడియాను నిషేధిస్తోందని అన్నారు. ప్రజాస్వామ్య హక్కులకు టీఆర్ఎస్ ప్రభుత్వం విఘాతం కల్గిస్తోందని దుయ్యబట్టారు. కేసీఆర్ ది ప్రజావ్యతిరేక పాలనని, రాజ్యాంగ పరిధిలో పాలన కొనసాగడం లేదని అన్నారు.