: అక్కడ రోడ్డు మీద ఉమ్మేస్తే 17,000 జరిమానా!


రోడ్డు మీద ఉమ్మేస్తే 17,000 రూపాయల జరిమానానా... మనదేశంలో ఎవరు పాటిస్తారు? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారా? మన దేశంలో కాదులెండి. చట్టాలు కఠినంగా అమలు చేసే దుబాయ్ లో ఈ నిబంధన అమలు కానుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అందాలకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే భారీ జరిమానాలు విధించాలని యూఏఈ పాలకులు నిర్ణయించారు. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, పోస్టర్లు అతికించినా వెయ్యి దిర్హామ్ (17,000 రూపాయలు) లు జరిమానాగా విధించనున్నారు. సముద్రంలో చమురు లీకేజీకి కారణమైతే 51,000 రూపాయలు, మున్సిపల్ చెత్త వాహనాల్లో పురుగుల మందులు జారవిడిస్తే 85,000 రూపాయలు జరిమానా విధించనున్నట్టు తెలిపారు. ఇలాంటి నిబంధనలే మన దేశంలో కూడా అమలైతే, ప్రభుత్వాలు మద్యం ద్వారా వచ్చే ఆదాయంపై ఆధారపడాల్సిన అవసరం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News