: గవర్నర్ నరసింహన్ ఢిల్లీ పర్యటన అందుకేనా?


'ఓటుకు నోటు' కేసులో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ముద్దాయేనని, అందుకు తగినన్ని ప్రాథమిక సాక్ష్యాలున్నాయని భావిస్తున్న తెలంగాణ ఏసీబీ బాబు పేరును నిందితుడిగా చేర్చాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ నేపథ్యంలోనే బాబు పేరు నిందితుడిగా చేరిస్తే అది 'సీరియస్ ఇష్యూ' అవుతుందని, తదనంతరం ఏర్పడే పరిణామాలపై చర్చించేందుకు గవర్నర్ నరసింహన్ ను కేంద్ర ప్రభుత్వం ఢిల్లీకి పిలిపించుకున్నట్టు తెలుస్తోంది. తక్షణం బయలుదేరి రావాలని గవర్నర్ నరసింహన్ ను కేంద్ర హోం శాఖ ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ సాయంత్రం ఢిల్లీ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం, రేపు ఆయన ఢిల్లీలోని హోం శాఖ అధికారులతో సమావేశం కానున్నారు.

  • Loading...

More Telugu News