: పసిడి ధర మళ్లీ తగ్గింది
జాతీయ మార్కెట్ లో బంగారం ధర మరింత తగ్గింది. వరుసగా ఐదవరోజు పసిడి ధర రూ.40 తగ్గి బులియన్ మార్కెట్ లో 10 గ్రాములు రూ.26,750లు పలుకుతోంది. అటు 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం కూడా రూ.26,750 ఉంది. డిమాండ్ లేమి, నగల వ్యాపారులు కొనుగోళ్లు తగ్గించడం తదితర కారణాల వల్ల బంగారం ధరలు తగ్గాయని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఇక వెండి ధర స్వల్పంగా రూ.150 తగ్గి కేజీ రూ.36,550 పలుకుతోంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో వెండి ధరలు తగ్గాయంటున్నారు.