: సెక్షన్-5, 8లపై హైకోర్టులో సీమాంధ్ర సెక్రటేరియట్ గెజిటెడ్ అధికారుల పిల్
హైదరాబాద్ లో సెక్షన్ 5, సెక్షన్ 8లు అమలు చేయడంలేదంటూ సీమాంధ్ర సెక్రటేరియట్ గెజిటెడ్ అధికారుల సంఘం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో సెక్షన్ 5 ప్రకారం చట్టాలు అమలు చేయడం లేదని, సెక్షన్-8 ప్రకారం శాంతిభద్రతలు గవర్నర్ కు అప్పగించేలా ఆదేశాలివ్వాలని పిల్ లో అధికారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ పిల్ లో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను ప్రతివాదులుగా చేర్చారు.