: ఏపీ అధికారులను హెచ్చరించిన బొత్స


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి వైకాపా నేత బొత్స సత్యనారాయణ పదునైన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేయడంలో అధికారులు పాలుపంచుకోరాదని సూచించారు. అధికార పక్షానికి వత్తాసు పలుకుతూ నీతి మాలిన పనులను అధికారులు చేయరాదని చెప్పారు. ఎన్నికలు ఐదేళ్లకోసారి వస్తాయని, అధికారం మారినప్పుడు తప్పు చేసిన అధికారులు సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుందని అన్నారు. అధికార పక్షం ఒత్తిళ్లకు తలొగ్గి అవకతవకలకు పాల్పడితే, భవిష్యత్తులో అధికారులే ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణలో మాదిరే ఏపీలో కూడా టీడీపీ ఓటుకు నోటు విధానాన్ని అమలు చేస్తోందని... ఈ వ్యవహారంలో పోలీసులను కూడా వాడుకుంటోందని అన్నారు.

  • Loading...

More Telugu News