: అత్యయిక స్థితిపై స్పందించిన ప్రధాని మోదీ


భారత్ లో 1975-77లో అత్యయిక పరిస్థితి ప్రవేశపెట్టి నేటితో 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్ లో స్పందించారు. ఓ శక్తిమంతమైన స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం ప్రగతికి ఎంతో కీలకమని, దేశ ప్రజాస్వామ్య ఆశయాలు, సంస్కృతిని బలోపేతం చేసేందుకు మరింత కృషి చేయాలని ప్రతి ఒక్కరిని మోదీ విజ్ఞప్తి చేశారు. దేశ చరిత్రలో నాటి ఎమర్జెన్సీని ఓ చీకటి కాలంగా పేర్కొన్నారు. అత్యయిక స్థితిని ఎదుర్కొన్న వారు మనందరికీ గర్వకారణమన్నారు. నాటి ఎమర్జెనీ ఎన్నో స్మృతులను గుర్తుకు తెచ్చిందని, ఎంతో నేర్చుకున్నామని ప్రధాని అన్నారు.

  • Loading...

More Telugu News