: అడవుల్లో కూలిన విమానం... ఐదు రోజుల తరువాత బిడ్డతో కలిసి బయటపడ్డ తల్లి


ఆ తల్లీ బిడ్డలకు భూమ్మీద ఇంకా బతకాలని రాసుంది. అందువల్లే ఘోర విమాన ప్రమాదం జరిగి మిగతావారంతా మరణించినా, వారిద్దరు మాత్రం ప్రాణాలతో మిగిలారు. కొలంబియాలోని నుక్వి నుంచి కెబ్డోకు బయలుదేరిన ఓ విమానం సాంకేతిక లోపం కారణంగా దట్టమైన అడవుల్లో కూలిపోయింది. ఈ ఘటన శనివారం నాడు జరుగగా, అప్పటి నుంచి 14 మందితో కూడిన రెస్క్యూ బృందం విమానం కోసం గాలింపు జరుపుతూనే వుంది. విమానం కూలిన ప్రాంతాన్ని వారు గమనించి, అక్కడికి వెళ్లగా, తల్లీ బిడ్డా ఐదు రోజుల నుంచి అక్కడే ఉండటాన్ని చూసి, వెంటనే హెలికాప్టరులో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తల్లికి స్వల్పగాయాలు కాగా, సంవత్సరం వయసున్న బిడ్డ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని వెల్లడించారు. విమానం కూలిన ప్రాంతం చాలా ప్రమాదకరమైన ప్రాంతమని, వారు ప్రాణాలు కాపాడుకోవడం ఓ అద్భుతమని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News