: విధేయుడిగా ఉంటే నచ్చలేదు... దిగ్విజయ్ కొంపముంచారని వాపోయిన డీఎస్


కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా, అధినేత ఆదేశాలకు అనుగుణంగా, వివాదరహితంగా, ప్రతిఒక్కరితో సమన్వయంతో పనిచేసుకుంటూ వెళ్లడం కొందరు పెద్దలకు నచ్చట్లేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నేత డి.శ్రీనివాస్ వాపోయారు. తనకు శాసనసభ్యుల కోటా నుంచి ఎమ్మెల్సీ టికెట్ ను రానీయకుండా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ అడ్డుపడ్డారని డీఎస్ తన సన్నిహితులు, అనుచరుల వద్ద ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ టికెట్ తనకు ఇచ్చేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అంగీకరించినా, దిగ్విజయ్ సింగ్ మాత్రం ఈర్ష్య, అసూయతో అడ్డుపడ్డారని డీఎస్ వాపోయినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News