: జడేజా... టీమిండియాకు పట్టిన జిడ్డూ!: సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లు
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను ఎట్టకేలకు జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేశాడు. ఏడాదిన్నరగా ఫామ్ లేకున్నా జట్టులో జడేజాను కొనసాగిస్తున్న కెప్టెన్ కూల్ పై విమర్శల జడివాన కురిసిన సంగతి తెలిసిందే. నిన్న బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో జడేజాను ధోనీ తుది జట్టులోకి తీసుకోలేదు. దీంతో వెనువెంటనే సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల పరంపరకు తెరతీశారు. రవీంద్ర జడేజా... టీమిండియాకు పట్టిన జిడ్డూ అని పేర్కొన్న నెటిజన్లు, ఇప్పటికైనా జట్టుకు అతడి జిడ్డు నుంచి విముక్తి లభించిందని వరుస కామెంట్లు సంధించారు.