: నోటీసులు తీసుకోకుంటే మెడపట్టి జైలుకు తరలిస్తాం: చంద్రబాబుపై తలసాని మళ్లీ ఫైర్


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏసీబీ తీరుతెన్నులపై అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఏసీబీ నోటీసులు తీసుకోకుంటే మెడ పట్టి జైలుకు తరలిస్తామని హెచ్చరించారు. ఏసీబీ గురించి చంద్రబాబు చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నాడని అన్నారు. తమకు నోటీసులు పంపే అధికారం ఏసీబీకి లేదని చంద్రబాబు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే తలసాని ఘాటుగా స్పందించారు.

  • Loading...

More Telugu News