: సుష్మ, వసుంధర రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు: రాజ్ నాథ్ సింగ్


లలిత్ మోదీ వివాదంలో ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, లలిత్ మోదీ పాస్ పోర్టు సిఫారసు వివాదంలో కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే సహా ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. లలిత్ మోదీ వివాదంలో సుష్మ స్వరాజ్, వసుంధర రాజే రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేయగా, మోదీకి చేతనైతే సుష్మను బర్తరఫ్ చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాలు విసిరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News