: కస్టమర్ల కోసం అన్ని హంగులతో స్పైస్ జెట్ మొబైల్ యాప్
చవకధరల విమానయాన సంస్థగా పేరుగాంచిన స్పైస్ జెట్ కస్టమర్ల కోసం మొబైల్ యాప్ ప్రవేశపెట్టింది. అన్ని హంగులతో ఉన్న ఈ యాప్ ద్వారా టికెట్ బుకింగ్స్, ఫ్లయిట్ స్టేటస్, ఫ్లయిట్ షెడ్యూల్ మార్పులు, విమాన సర్వీసుల క్యాన్సిలేషన్లు, రిఫండ్ తదితర అంశాలను మేనేజ్ చేసుకోవచ్చు. ఈ యాప్ ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పేమెంట్ కోసం పలు రకాల ఆప్షన్లు పొందుపరిచారు. క్విక్ పే, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆప్షన్లలో మనకు అనుకూలమైన దాన్ని ఎంచుకుని చెల్లింపులు చేయవచ్చు. టికెట్లే కాకుండా, మీల్స్, స్పైస్ మాక్స్, స్పైస్ అస్యూరెన్స్ వంటి సదుపాయాలను కూడా ఈ యాప్ సాయంతో పొందవచ్చు.