: కేసీఆర్ ధర్నా చేస్తారా? ఏం, మేం చేయలేమా?: అచ్చెన్నాయుడు


హైదరాబాదులో సెక్షన్ 8 పెడితే ఆందోళనకు సిద్ధమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నిరాహార దీక్షల వల్ల చట్టాలు మారుతాయని హామీ ఇస్తే, తాము కూడా లక్షలాది మందితో ధర్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, అలా ధర్నా చేస్తే హైదరాబాదును ఏపీలో కలుపుతారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ వి తాటాకు చప్పుళ్లేనని, వాటికి బెదిరేందుకు ఎవరూ సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదులో సెక్షన్ 8 అమలు కావాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరలించేందుకు కేసీఆర్ సెక్షన్ 8 పై ఏదో ఒకటి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News