: టీడీపీ వాళ్లు నన్ను కిడ్నాప్ చేయలేదు: ఎంపీటీసీ వెంకట్రావు
ప్రకాశం జిల్లా ఇనమనమోళ్లూరు ఎంపీటీసీ యాదాల వెంకట్రావు కిడ్నాప్ మిస్టరీ వీడింది. ఈ రోజు జిల్లాలోని పోలీసుల ముందు ఆయన ప్రత్యక్షమయ్యారు. తనను టీడీపీ వాళ్లు కిడ్నాప్ చేయలేదని చెప్పారు. సొంత పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లానన్నారు. వైసీపీ నేతలు తన భార్యను కిడ్నాప్ చేసి తప్పుడు కేసు పెట్టించారని వివరించారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఇతర నేతలు తన భర్తను ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశారంటూ వెంకట్రావు భార్య మేరీ నిన్న(మంగళవారం) మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో ఎంపీటీసీ పోలీసులకు పైవిధంగా వివరణ ఇచ్చారు. అయితే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలోనే ఇటువంటి రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నట్టు సమాచారం.