: కోరిన పాట వినిపించ లేదని డీజేను కాల్చిచంపిన అతిథి
తానడిగిన పాట వినిపించలేదని డీజేను కాల్చిచంపాడో వ్యక్తి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీ సమీపంలోని సింఘావులీ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఓ ఆభరణాల వ్యాపారి మనవరాలి పుట్టిన రోజు వేడుకలకు అతిథిగా వచ్చిన వ్యక్తి 'తమాంచెై పే డిస్కో' అనే పాట వినిపించాలని డీజే అరుణ్ ను కోరాడు. ఆ పాట ఎక్కడుందో వెతికేందుకు అరుణ్ కొంత సమయం తీసుకున్నాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి తన వద్ద వున్న దేశవాళీ తుపాకితో డీజేపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన డీజేను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు పోయినట్టు డాక్టర్లు తెలిపారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు పెట్టి జైలుకు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.